మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎమ్) అధినేత, సినీ నటుడు కమల్ల హాసన్ త్వరలోనే రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరొకరు కూడా రాజ్యసభకు వెళ్తారని సమాచారం. 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికార డీఎంకే పార్టీలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పొత్తు పెట్టుకుంది.
అప్పుడు కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపిస్తామని డీఎంకే పార్టీ అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయనకు ప్రామిస్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే విశ్వనటుడిని రాజ్యసభకు పంపించేందుకు డీఎంకే పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని డీఎంకే పార్టీకి చెందని మంత్రి ఒకరు, అధికార ప్రతినిధి సైతం ధృవీకరించినట్లు సమాచారం. ఇక కమల్ హాసన్ పార్టీ నుంచి మరొకరికి కూడా రాజ్యసభ స్థానం దక్కనుందని తెలుస్తోంది.