టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కొద్దిసేపటి కిందట టాస్ ప్రక్రియ ముగియగా.. టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఇంగ్లండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు వన్డే సిరీస్ పైనా కన్నేసింది.
వరుసగా రెండు వన్డేలు గెలిచిన రోహిత్ సేన.. చాంపియన్ ట్రోఫీ -2025 టోర్నీ కంటే ముందే ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఇక వన్డే సిరీస్ దక్కించుకోవాలని చూస్తున్నది. కాగా, డూ ఆర్ డై మ్యాచులో ఎలాగైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ జట్టు చూస్తోంది. మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్గురు ప్లేయర్లు మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తికి విశ్రాంతిని ఇవ్వడంతో పాటు అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో స్థానం కల్పించాడు.