తండేల్ మూవీ టీమ్ తిరుమల తిరుపతి సన్నిధానంలో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. శ్రీవారిని సేవించుకున్న వారిలో తండేల్ మూవీ హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, డైరెక్టర్ చందు మొండేటి తదితరులు ఉన్నారు.
ఇదిలాఉండగా, తండేల్ మూవీ అద్భుతమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందు వచ్చి అందరినీ మెస్మరైజ్ చేసింది. సినిమా చాలా బాగుందని నాగచైతన్య,సాయిపల్లవి తమ క్యారెక్టర్లలో లీనమై నటించారని సినిమా చూసిన వారంతా చెబుతున్నారు. సినిమా ఇంత పెద్ద విజయం సాధించడంతో చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లినట్లు తెలిసింది. కాగా, తండేల్ మూవీకి భారీ కలెక్లన్లు వస్తుండగా.. మరోవైపు పైరసీ బెడద మూవీని వెంటాడుతోంది.
https://twitter.com/ChotaNewsApp/status/1889890970478751755