వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థి మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
అయితే,తమ బిడ్డను హాస్టల్ సిబ్బందే ఏదో చేసి ఉంటారని వారిపై కుటుంబసభ్యులు కర్రలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితులను అదుపుచేసేందుకు వెంటనే పోలీసులు చేరుకున్నారు. తమ బిడ్డ ఎలా చనిపోయాడో కారణం కూడా చెప్పకుండా పోస్టుమార్టం నిర్వహించడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆస్పత్రి పోస్టుమార్టం సెంటర్ బయట కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు పోలీసులను వేడుకుంటున్నారు.
https://twitter.com/TeluguScribe/status/1889921299885011276