యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఘట్టం తుది అంకానికి చేరుకుంది. ఈనెల 26వ తేదీతో ఈ మహాకుంభ్ ముగియనుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ప్రముఖులు, రాజకీయనాయకులు, సినీ వ్యక్తులు త్రివేణి సంగమం వద్దకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సైతం గురువారం తెల్లవారుజామున ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించారు. జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి యూపీ వెళ్లిన ఈటల..దాదాపు 10 కి.మీ ప్రజలతో కాలినడకన త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.