తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై యాదాద్రి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల మీద బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్న తీరుపై ఆయన స్పందిస్తూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోందన్నారు.
అంతేకాకుండా, తాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నట్లు ఎంపీ చామల తన మనసులోని మాటను బయటపెట్టారు. తాము అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు,చేసిన పనులు చెప్పుకోవడంలో విఫలం అయ్యామని స్పష్టంచేశారు. ప్రతి పక్షాలు ప్రచారం చేస్తున్నంతగా తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, గురువారం ఉదయం ఢిల్లీలో మీడియాతో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.