లోక్ సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్ మెంట్ ఇయర్ అనేవి ఉండగా.. ఇక నుంచి ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 01 నుంచి అమలులోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్ సభను వాయిదా వేశారు.
మరోవైపు వక్ఫ్ బిల్లు పై పార్లమెంటరీ సంయుక్త కమిటీ నివేదికకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల నిరసన మధ్యే కేంద్రం ఆమోదం తెలిపింది. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం కేపీఎస్ ఇటీవల సవరణ బిల్లు నివేదికను ఆమోదించింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత జవాబు దారి తనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే ఇది ముస్లింల హక్కులపై దాడేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.