వల్లభనేని వంశీని ఇప్పుడు కాదు.. ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ రెడ్ బుక్ చట్టాన్ని ఫాలో అవుతుంది కాబట్టే వంశీ అరెస్ట్ ఇంత ఆలస్యమైంది. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే ఎవరూ క్షమించరు అన్నారు. ఆ దాడిలో వంశీ పాత్ర ఉంది కాబట్టే అతడినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవాళ హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లారు పోలీసులు. తొలుత భవానీపురం పీఎస్ కి వల్లభనేని వంశీని తరలించారు. అక్కడ వాహనాన్ని మార్చి మరో చోటుకు తరలించే ప్రయత్నం చేసారు పోలీసులు. ప్రస్తుతం వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు స్టేషన్ లో విచారిస్తున్నారు. అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.