Pink Book మేము కూడా రాసుకుంటున్నాం : ఎమ్మెల్సీ కవిత

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ట్విట్టర్ లో ఎవరైనా ఒక కామెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి..తెల్లారేకల్లా అరెస్ట్ వస్తది ఇంటికి. ఫేస్ బుక్ లో  ఎవరైనా వీడియో పెడితే భయం. తెల్లారే సరికి పోలీసోళ్లు వస్తారు.అదే క్రమంలో మా కో ఆర్డినేటర్ మనోజ్ రెడ్డి పై మీద కూడా కేసులు పెట్టి తమ్ముడిని, తనను 16 రోజుల పాటు కుటుంబాన్ని, ఆయనను ఇబ్బంది పెట్టి జైలులో పెట్టడం జరిగింది.

మేము కూడా చూస్తున్నాం.బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతది. ఇబ్బంది పడోద్దు..ఇంతకింత తిరిగి చెల్లిస్తామని తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ ప్యాకెట్ లో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంట తిరుగుతడు. చూస్తా ఉన్నాం.మాకు లెక్కలు ఎట్లా రాయాలో జయశంకర్ సార్ నేర్పించాడు. ఎలా ఉద్యమాలు చేయాలో .. మా పై అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు తీసి మేము అధికారంలోకిచ్చాక ఇంతకింత చెల్లిస్తాం” అని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news