రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలోని నిరుపేద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు వస్తాయని ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. ఈ క్రమంలోనే రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎమ్మార్వో ఆఫీస్లో పెట్రోల్ పోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామంలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. సందీప్ గౌడ్ అనే యువకుడు రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎమ్మార్వో ఆఫీస్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రేషన్ కార్డు గురించి ఎన్నిసార్లు అడిగినా అధికారులు పొంతన లేని సమాధానం చెప్తున్నారని, తిరిగి తిరిగి విసుగు చెందానని, అందుకే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నాడు.
https://twitter.com/TeluguScribe/status/1890266704334201115