కాంగ్రెస్ వల్లే భూగర్భ జలాలు పడిపోయాయ్ : హరీశ్ రావు

-

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన భూగర్భ జలాలు పడిపోయాయని ఫలితంగా సాగు, తాగునీటి గోసలు నెలకొన్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు అన్నారు.ఒకప్పుడు భూగర్భ జలాల పరిరక్షణకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వలన సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.


రాష్ట్రంలో 2013-23మధ్య పెరిగిన భూగర్భ జలాలు..ప్రస్తుతం పడిపోయాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి భూగర్భ జల మట్టాల కథనాన్ని హరీష్ రావు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేసీఆర్ హయాంలో 2013 నుంచి 2023 వరకు భూగర్భజలాలు 56% పెరిగి దేశంలోనే అత్యధికంగా భూగర్భజలాలు పెరిగాయన్నారు. మిషన్ కాకతీయ ఈ విజయంలో కాళేశ్వరం కీలక పాత్ర పోషించిందని, 27,000 ట్యాంకులను పునరుద్ధరణ, 15 లక్షల ఎకరాలకు సాగు నీరు, 8.93 టీఎంసీ అడుగుల నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో రైతులు బాగుపడ్డారని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news