బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలందరికీ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతా వేదికగా సిద్దిపేట ఎమ్మెల్యే స్పందించారు.
సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం మనందరం కృషి చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించించి వారిని ఘనంగా గౌరవించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం సేవాలాల్ మహరాజ్ జయంతిని నిర్వహించకపోవడం గిరిజనులకు అవమానకరమని పరోక్షంగా విమర్శించారు.