ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని అరకిలోమీటర్ నడిచిన మహిళ.. ఏం చేసిందంటే?

-

ప్యాసింజర్స్ ఆపమంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఆపడం లేదని ఓ మహిళ సీరియస్ అయ్యింది.రెండు గంటలు నిల్చున్నా.. ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదని, ఫ్రీ బస్సు వల్ల ఎవరికి మేలు జరుగుతుందని ప్రభుత్వాన్ని దూషించింది. మేము అడిగినమా? ఫ్రీ బస్సు పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అంటూ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద బస్సు ఆపేందుకు 2 గంటలుగా ప్రయత్నం చేసినా ఒక్క బస్సు కూడా ఆపకపోవడంతో ఆ మహిళ అర కిలోమీటరు దూరంలో ఉన్న మంచాల మండల ఆఫీసు వద్దకు బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వచ్చినట్లు పేర్కొంది. బస్సు ఎక్కిన అనంతరం డ్రైవర్‌, కండక్టర్‌ను నిలదీసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

https://twitter.com/TeluguScribe/status/1890635757150159047

Read more RELATED
Recommended to you

Latest news