ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్‌లను తిరిగి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు సీఎం అయ్యాక వాటిని తిరిగి పునరుద్దరించారు. తక్కువ ధరకే నిరుపేదలకు భోజనం,అల్పాహారం అందించేందుకు వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే, ఒంగోలులోని ట్రాన్స్‌కో ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్ శనివారం ఉదయం పరిశీలించారు. క్యాంటీన్‌లో అల్పాహారం తిని,నాణ్యతను స్వయంగా తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో ఆహారం చాలా బాగుందని మున్సిపల్ శాఖ కమిషనర్ సంపత్ కుమార్ మెచ్చుకున్నట్లు సమాచారం.