ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజీపీ అభ్యర్థి మల్క కొమురయ్యను గెలిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జీవో 317కు వ్యతిరేకంగా కుటుంబాలను కూడా వదులుకుని పోలీసులతో లాఠీ దెబ్బలు, కేసులకు భయపడకుండా బీజేపీ కార్యకర్తల త్యాగం చేశారని.. ఆ పోరాటాన్ని గుర్తించుకుని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యను గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 317జీవోకు వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తగులుతున్నా ఛాతీ ఎత్తి పోరాడామని..ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా మీకోసం గొంతు ఎత్తామని,అధికారం లేకుండానే టీచర్ల కోసం నిలబడ్డామని బండి సంజయ్ గుర్తుచేశారు. అందుకే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే.. మీ గొంతుకై నినదిస్తరు.. మీ గోసలపై నిలదీస్తరు.. సమస్యలని ప్రస్తావిస్తరు..పరిష్కార మార్గం పట్టిస్తరని బండి సంజయ్ వెల్లడించారు.