పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తడంతో అది కాస్త కత్తి పోట్ల వరకు వెళ్లింది. ఈ దాడిలో ముగ్గురు యువకుల పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భయానక ఘటన హన్మకొండ జిల్లాలోని హసన్ పర్తి మండలం మడిపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తుండగా ఒకరి నొకరు తొసుకున్నట్లు తెలిసింది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో రెండు వర్గాలు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం.ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.