ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు

-

కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదిక కానుంది. గత ఏడాది డిసెంబర్ లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యగ్రహంలో తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా ఏప్రిల్ 08, 09 తేదీలలో ఇక్కడ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఏప్రిల్ 08న సీడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 09న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ రెండు సమావేశాలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన వహిస్తారన్నారు. ఈ కీలక భేటీ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలను ఒక చోటుకు చేర్చడమే కాకుండా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఎదురయ్యే సవాళ్లు, రాజ్యాంగం, దాని విలువలపై నిరంతరం జరుగుతున్న దాడిపై చర్చించి భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ కార్యాలయం బేరర్లు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news