దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఇవాళ రైతుల అకౌంట్లో వేయనుంది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 18 విడతల్లో డబ్బులు జమ చేసింది ప్రధాని మోడీ ప్రభుత్వం. అయితే ఇవాళ 19వ విడత డబ్బులను విడుదల చేయనుంది. బీహార్ రాష్ట్రంలో ఉన్న భాగల్పూర్ లో జరిగే ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.

ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు. దాదాపు 22 వేల కోట్లను 9.8 కోట్ల మంది రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పిఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి 6000 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తుంది మోడీ సర్కార్. మూడు విడతల్లో 2000 రూపాయల చొప్పున.. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జమ చేస్తోంది. త్వరలోనే దీని పరిధి పదివేల రూపాయలకు కూడా పెంచబోతున్నారని వార్తలు వస్తున్నాయి.