ఈనెల 27వ తేదీన టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నిజామాబాద్‌లోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలనూ నెరవేరుస్తున్నదని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వలేదని ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శిస్తున్నాయని.. ప్రతి ఎకరాకు రూ. 6 వేలు చొప్పున.. సంవత్సరానికి 12 వేలు రైతు భరోసా మీ ఖాతాల్లో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం ప్రకటనతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.
ప్రతి ఎకరాకు 6 వేలు చొప్పున.. సంవత్సరానికి 12 వేలు రైతు భరోసా మీ ఖాతాల్లో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వెయ్యండి – రేవంత్ రెడ్డి pic.twitter.com/SoNaJNeyop
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025