కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న ఆటో ట్రాలీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. దీంతో కోడి గుడ్లన్ని రోడ్డు మీద పడి పగిలిపోయాయి. రోడ్డు మొత్తం గుడ్ల సొన పేరుకుపోవడంతో దాని మీదుగా వెళ్లేందుకు వాహనదారులు భయపడుతున్నారు.దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ ఘటన కృష్ణాజిల్లా గన్నవరంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. రోడ్డుపై కోడిగుడ్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో వాటిని క్లీన్ చేసేందుకు మున్సిపల్ సిబ్బందిని స్థానికులు సంప్రదించినట్లు సమాచారం. మృతి చెందిన డ్రైవర్ మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.