విశాఖ ఉక్కు పరిరక్షణకు రూ.13 వేల కోట్లు తెచ్చాం : మంత్రి నారా లోకేష్

-

శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మాణం పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మేము పదవులు అడగలేదు. రాష్ట్రాన్ని కాపాడాలని మాత్రమే కోరామని తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు రూ.13వేల కోట్లు తెచ్చామన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నామని గుర్తు చేవారు. అదేవిధంగా రైల్వే జోన్ తీసుకురావడంతో పాటు పోలవరం, అమరావతికి కూడా నిధులు తెచ్చామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారం ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం అని.. అందుకే తాము బేషరతుగా ఎన్డీఏలో చేరామన్నారు. ఐదేళ్లలో మీరు తీసుకురాలేని నిధులు తాము 9 నెలల్లో తెచ్చామని చెప్పారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి లోకేస్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6.5లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయన్నారు. ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు వచ్చే సరికి రెండు, మూడు ఏళ్లు పడుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించామని మాత్రమే తాము చెప్పామని.. ఉద్యోగాలు ఇచ్చామని తాము ఎక్కడా చెప్పలేదని వివరణ ఇచ్చారు. 

Read more RELATED
Recommended to you

Latest news