తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. రుణం కట్టలేదని రైతు బైక్ను బ్యాంక్ అధికారులు లాక్కెళ్లారు. ఈ సంఘటన రంగారెడ్డిలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడలో రైతు రుణం కట్టలేదని బైక్ను సహకార బ్యాంక్ అధికారులు లాక్కెళ్లారు. మేడిపల్లి గ్రామంలో రైతు ఇక్కె పర్వతాలుకు చెందిన భూమిని ఫార్మాసిటీలో భాగంగా ప్రభుత్వం సేకరించింది.

అయితే ఆ సమయంలో రైతులకు భూమిపై ఎలాంటి రుణాలు ఉన్నా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇప్పుడు అవేమీ పట్టించుకోకపోవడంతో.. రైతులను బెదిరింపులకు గురి చేస్తూ బైక్ను లాకెళ్లారు బ్యాంక్ అధికారులు. దీంతో తమను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
రుణం కట్టలేదని రైతు బైక్ను లాక్కెళ్లిన బ్యాంక్ అధికారులు
రంగారెడ్డి – యాచారం మండలం గడ్డమల్లయ్యగూడలో రైతు రుణం కట్టలేదని బైక్ను లాక్కెళ్లిన సహకార బ్యాంక్ అధికారులు
మేడిపల్లి గ్రామంలో రైతు ఇక్కె పర్వతాలుకు చెందిన భూమిని ఫార్మాసిటీలో భాగంగా ప్రభుత్వం సేకరించింది.. అయితే ఆ… pic.twitter.com/ChO3Gml2y9
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2025