ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.‘మంత్రులు నిద్ర కూడా పోకుండా SLBC వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.టన్నెల్ లోకి కొంచెం దూరం వెళితేనే మనకు భయం అవుతుంది.
అలాంటిది లోపల చిక్కుకున్న ఆ 8 మంది కోసం రెస్క్యూ టీం వాళ్లు 13 కిలోమీటర్ల లోపలికి వెళ్లారు.సీఎం ఆదేశాల మేరకు మంత్రులు జూపల్లి, ఉత్తమ్ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.లోపల మట్టి, బురద ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది’ అని ఆయన వెల్లడించారు.