కేటీఆర్ టీ స్టాల్‌ తొలగింపు… కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు !

-

కేటీఆర్ టీ స్టాల్‌ తొలగింపుపై…బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కేసీఆర్ హయాంలో రూ. 250 కోట్లు ఖర్చు చేశామన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

On the occasion of Mahashivratri, Sri Rajarajeswara Swamy visited Vemulawada by MLC Kavitha

సిరిసిల్ల జిల్లా లో బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్ గారి ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్‌ను తీసేయించిన దుర్మార్గపు ప్రభుత్వం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఫైర్‌ అయ్యారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరుపొందింది.. చేనేత కార్మికుల కోసం కేటీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Latest news