వేములవాడ అభివృద్ధిని కాంగ్రెస్ కొనసాగించాలి : కవిత

-

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పిలుచుకునే తెలంగాణలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. బుధవారం ఉదయం రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని.. కేసీఆర్ రూ. 250 కోట్లతో చేపట్టిన వేములవాడ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు.

గుడిచెరువు వద్ధ భక్తుల కోసం చేపట్టాల్సిన వసతులను త్వరగా పూర్తిచేయాలన్నారు. వేములవాడ రాజన్న పేరుతోనే సిరిసిల్ల రాజన్న జిల్లాను అప్పట్లో కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరొందినదని, చేనేత కార్మికుల కోసం కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.సిరిసిల్ల చేనేత కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news