ఇవాళ SLBC టన్నెల్ ప్రమాదస్థలికి వెళ్లనుంది BRS బృందం. SLBC టన్నెల్ ప్రమాదస్థలికి నేడు అంటే గురువారం బీఆర్‌ఎస్ బృందం వెళ్లనుంది. మాజీ మంత్రి హరీశ్ రావు సారథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ముఖ్య నాయకులు ఘటనా స్థలిని సందర్శించనున్నారు.

తమ వైపు నుంచి ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయడానికి ఘటనాస్థలికి వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారని వివరించారు. తమ పర్యటనకు రాజకీయ ఉద్దేశం ఏమీ లేదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
కాగా, టన్నెల్‌లో చిక్కుకున్న వారు బతికే ఛాన్స్ లేదు అంటూ రెస్క్యూ టీమ్ అధికారులు చెబుతున్నారు. SLBC టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, కార్మికులు బతికే ఛాన్స్ లేదని అధికారులు చెబుతున్నారు. వారంతా TBM మెషీ న్ చుట్టూ బురద లో కూరుకుపోయి చనిపోవచ్చని భావిస్తున్నారు.