దుబాయ్ లో కేదార్ మృతి రాష్ట్రంలో సంచలనంగా మారింది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేదార్.. జూబ్లీ హిల్స్ లో గతంలో పబ్ లను నడిపిన వ్యక్తి. గతంలో డ్రగ్స్ కేసులో దొరికాడు. ఆయనతో పాటు డ్రగ్స్ కేసులో ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలి. తెలంగాణ లో సంపాదించిన అక్రమ సంపాదన వేల కోట్లు దుబాయ్ కి తరలించబడ్డవి. అక్రమ డబ్బులు ఎవరు దుబాయ్ కి తరలించారో ప్రజలకు తెలియాలి.
కేంద్ర,రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్న. గత ప్రభుత్వంలో ఉన్న బినామిలు ఇప్పుడు ఎక్కడికి పోయారో తెలియాలి. వెలకోట్లు విదేశాలకు తరలిపోతుంటే రాష్ట్రంలో విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి.. ప్రభుత్వం ఏర్పడి 14నెలలు అవుతున్నా విచారణ సంస్థలు ఇప్పటి వరకు ఒక్క హవాలా వ్యక్తి ని కూడా పట్టుకోలేదు. డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుల ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైన హవాలా దందా పై యాక్షన్ తీసుకోకపోతే భవిషత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అని ఎమ్మెల్యే యెన్నం పేర్కొన్నారు.