ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. మద్యం మత్తులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దుంప వేంకటేశ్వర రావు అనే వ్యక్తి, రోడ్డుపై ఆడుకుంటున్న ఒక చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

ఆ చిన్నారి కేకలు వేయ్యటంతో పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసును విచారిస్తున్నారు.