SLBC వద్దకు చేరుకున్న అంబులెన్సులు!

-

SLBC టన్నెల్ ప్రమాదం లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ఎనిమిదో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. లోపల ఉన్న ఎనిమిది మందిని బయటికి తీసుకు వచ్చేందుకు… దాదాపు 7 రోజులుగా అధికారులు కష్టపడ్డారు. ఇవాళ ఎనిమిదవ రోజు కూడా వాళ్ళను బయటకు తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లోపల ఉన్న ఎనిమిది మంది ఇప్పటికే మరణించినట్లు తెలుస్తోంది. మంత్రులు కూడా వాళ్ళ ప్రాణాలపై నమ్మకం లేదని కూడా తేల్చి చెప్పారు.

Ambulances arrive at SLBC

అయితే లోపల ఉన్న వాళ్ళ బాడీలను ఇవాళ సాయంత్రం లోపు తీసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడు మీటర్ల లోతులో వాళ్ళ శవాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బయటకు వాళ్ళ మృతదేహాలు తీసిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి పోస్టుమార్టం చేసేందుకు అంబులెన్సులు రెడీగా ఉంచారు. ఏ క్షణమైనా వాళ్ళ డెడ్ బాడీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి నిజంగానే వాళ్ళు బతికున్నారా లేదా చనిపోయారా అనే విషయం మాత్రం ఇప్పటివరకు ఏ అధికారి చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news