రోడ్డు పక్కన,హైవే పక్కన చెత్త వేస్తున్న దాబాలకు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. భిక్కనూరు సాంఘిక సంక్షేమ కళాశాలలో రాత్రి బస చేసిన ఆయన శనివారం ఉదయం కళాశాల పాఠశాల విద్యార్థులతో కలిసి వాకింగ్ చేశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి యోగా చేసి ఫిట్నెస్ గురించి సలహాలు సూచనలు చేశారు.పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఇంటర్ విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. బాగా చదువుకోవాలని సూచించారు.ఐఐటీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నతరగతులను విద్యార్థులతో కలిసి పరిశీలించారు.కాసేపు వారికి విద్యాబోధన కూడా చేశారు.