రేపు రాత్రి లోపు 4 గురి మృతదేహాలు వెలికితీస్తామని ప్రకటించారు మంత్రి జూపల్లి. SLBC టన్నెల్ సంఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. రెస్క్యూ ఆపరేషన్స్ లో పురోగతి ఉందని వివరించారు. GPR ద్వారా 4 పాయింట్స్ మార్క్ చేశారు.. అక్కడ రేపు రాత్రి వరకు వెలికితీస్తామని వెల్లడించారు. మరో చోట 21 అడుగుల లోతు బురద పేరుకుపోయి ఉందన్నారు మంత్రి జూపల్లి.

మిగతా నలుగురు టిబిసి మెషీన్ కింద ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆచూకీ కనుక్కోవడం మరింత ఆలస్యం అవుతుందన్నారు మంత్రి జూపల్లి. రేపు రాత్రి లోపు నలుగురి మృతదేహాలు వెలికితీస్తామన్నారు. మిగతా నలుగురి ఆచూకీ కనుక్కోవడమే మరింత ఆలస్యం అవుతుందని తెలిపారు.పెద్ద ఎత్తున బురద, మట్టి పేరుకుపోవడం కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఆలస్యం అయ్యాయి..కొందరు రాజకీయం చేసి మాట్లాడుతున్నారని వివరించారు.