తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి 24 గంటల పాటు దుకాణాలు ఓపెన్ కానున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా ఇవాల్టి నుంచి 24 గంటల పాటు దుకాణాలు తెరిచి ఉండనున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. అర్ధరాత్రి కూడా దుకాణాలు తీసుకుంటే ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెసులుబాటు కల్పిస్తూ గత నెలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. నిర్ణయం తీసుకుంది. అయితే దుకాణాలు అలాగే వ్యాపార సముదాయాలలో పనిచేసే సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా 48 గంటలకు మించి పని చేస్తే యాజమాన్యం రెట్టింపు జీతం ఇవ్వాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాగా నిన్న నెలవంక కనిపించడంతో రంజాన్ ప్రారంభమైనట్లు ప్రకటన చేశారు ముస్లింలు. దీంతో 31 రోజుల పాటు ఉపవాసాలు కొనసాగనున్నాయి.