సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపో మాపో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ కి పోతున్నారు. మీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతుంది.. సీఎం కుర్చీకే ఎసరు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదన్నారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
మంత్రులు తన మాట వినడం లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. బీసీల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. మామునూర్ ఎయిర్ పోర్టుతో కాంగ్రెస్ కి సంబంధం లేదన్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కూడా రేవంత్ రెడ్డి కాపాడుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు 6 మంత్రి పదవులు భర్తీ చేయలేదు. మంత్రి పదవుల్లో బీసీలకు కేటాయించలేదన్నారు.