కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశం పై ఏఐసీసీ సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు.. తన నివాసంలో బీసీ నేతలతో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని తేల్చి చెప్పారు. అలాగే బీసీ కులగణన కు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా సహకరిస్తామని తెలిపారని, త్వరలోనే సీఎం అపాయింట్మెంట్ కోరుతున్నామని ఆయన తెలిపారు. సీఎం అపాయింట్మెంట్ ఇస్తే.. ఆయనతో మాట్లాడి.. మున్నూరుకాపు సభ ఎప్పుడు ఎక్కడ పెడతామో చెబుతానని వీహెచ్ అన్నారు.
పార్టీలో ఒకరిద్దరు నేతలు నాపై కోపంగా ఉండొచ్చు.. కానీ తాను పార్టీకి చెడు చేయనని ఈ సందర్భంగా వీ హనుమంతరావు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మున్నూరు కాపు నేతల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వీ.హెచ్. మాట్లాడారని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది.