రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నిధులు ఢిల్లీకి పోతున్నాయి : కేటీఆర్

-

సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చూస్తూ ఊరుకోం. 48 గంటల్లో నీళ్లను వదిలి పెట్టకపోతే మంత్రి ఛాంబర్ ముందట ధర్నా చేస్తా. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్ట అని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా ఏదురుకో కానీ రైతులను గోస పెట్టుకు. ఇప్పటికే 450 మంది రైతులను రేవంత్ రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు. కాంగ్రెస్ చెప్పిన రైతు డిక్లరేషన్ లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదు. రైతు బంధును కూడా రాలేదు ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే తెలివి లేదు నీళ్లు ఇచ్చే తెలివి లేదు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీళ్లేమో పాతాళంలోకి పోయినాయి.. నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి నియామకాలు ఏమో గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులను కాపాడుకోవడానికి వెంటనే నీళ్లను విడుదల చేయాలి. ప్రస్తుతం మిడ్ మానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క టీఎంసీ నీళ్లను మల్కపేట రిజర్వాయర్కు వదిలిపెట్టాలని కోరుతున్నాము. తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు మాత్రమే కావాలి. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాదు ఇంకా 13 టిఎంసిల నీళ్లు మిడ్ మానేరు లో ఉన్నాయి. రైతులకు నీళ్లు విడుదల చేయకపోతే అన్నదాతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రైతులు గుండె ధైర్యంతో ఉండి వ్యవసాయాన్ని కొనసాగించాలి అని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news