ఏపీలో నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి ఏపీ శాసనమండలి సమావేశాలు. ఈ సందర్భంగా 2023 – 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ యొక్క 49వ వార్షిక నివేదిక ప్రతిని, 2013, కంపెనీల చట్టంలోని 394(2)వ సెక్షను క్రింద ఆవశ్యకమైన విధంగా సభా సమక్షంలో ఉంచనున్నారు మంత్రి కందుల దుర్గేష్.

2022-2023 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్సి) యొక్క 9వ వార్షిక నివేదిక ప్రతిని, 2003, విద్యుత్ చట్టంలోని 104వ, 105వ సెక్షనుల క్రింద ఆవశ్యకమైన విధంగా సభా సమక్షంలో ఉంచనున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. 2021-2022 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ లిమిటెడ్ (ఎపిఐఐసి) యొక్క 49వ వార్షిక నివేదిక ప్రతిని, 2013, కంపెనీల చట్టంలోని 394వ, 395వ సెక్షనుల క్రింద ఆవశ్యకమైన విధంగా సభా సమక్షంలో ఉంచనున్నారు మంత్రి టి.జి.భరత్. అనంతరం 2025 – 26 బడ్జెట్ పై సాధారణ చర్చ ఉంటుంది. మండలిలో హామీల అమలు, బడ్జెట్ కేటాయింపులపై గట్టిగా ప్రశ్నించే ఆలోచనలో వైసీపీ సభ్యులు ఉన్నారు.