సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. సామాన్యలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరికొందరు ఏకంగా వారి లైఫ్స్‌ను రిస్కులో పడేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రీల్స్‌లో వైరల్ అయ్యేందుకు కదులుతున్న రైలులో విండో పక్కన కూర్చున్న ప్రయాణికుడి చెంపపై బలంగా కొట్టాడు.
ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని రాజధాని పాట్నాలో వెలుగుచూసింది. రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్‌తో ఓ యూట్యూబర్ కొట్టించాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడు రితేష్ కుమార్, అతడి ఫ్రెండ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, వ్యూస్ కోసం ఇలా చేశానంటూ రితేష్ కుమార్ బహిరంగ క్షమాపణలు చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి..
పాట్నా: రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్‌తో కొట్టించిన యూట్యూబర్. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించి రితేష్ కుమార్, అతడి ఫ్రెండ్‌ను అరెస్ట్… pic.twitter.com/ZKisg7xWIS
— ChotaNews App (@ChotaNewsApp) March 3, 2025