ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో విగతజీవులుగా మారిన 8 మంది మృతదేహాలు ప్రశ్నార్థకంగా మారాయి. SLBC టన్నెల్ ప్రమాదం జరిగి నేటితో పది రోజులు పూర్తయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జీపీఆర్ రేడార్ డేటా, మార్కింగ్ వద్ద తవ్వకాలు కొనసాగుతున్నాయి.
అయితే, టన్నెల్‌లో ఎండ్ పాయింట్ కీలకంగా మారింది. మట్టిదిబ్బలు కూలడంతో టన్నెల్ పూర్తిగా మూసుకుపోయినట్లు కనిపిస్తుంది. ఆ ఎండ్ పాయింట్ క్లియర్ చేస్తే అవతల మరికొంత దూరం వరకు శిథిలాలు ఉండే అవకాశం ఉన్నట్లు రెస్క్యూ సిబ్బంది అనుమానిస్తున్నారు. ఎండ్ పాయింట్ నుంచి కొన్ని మీటర్లు తవ్వితేనే కార్మికుల ఆచూకీ తేలనున్నది. కాగా, మృతదేహాలను బయటకు ఎప్పుడు వెలికి తీస్తారా? అని అధికారులు, బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
ప్రశ్నార్థకంగా.. 8 మంది మృతదేహాలు?
పదోరోజుకు చేరిన SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
GPR రాడార్ డేటా, మార్కింగ్ వద్ద కొనసాగుతున్న తవ్వకాలు
టన్నెల్‌లో కీలకంగా మారిన ఎండ్ పాయింట్
టెన్నెల్ పూర్తిగా మూసుకుపోయినట్లు కనిపిస్తున్న ఎండ్ పాయింట్
అవతల మరికొంత దూరం వరకు శిథిలాలు ఉండే… pic.twitter.com/ZYmv0g2rzn
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 3, 2025