కాంగ్రెస్ ఇన్చార్జి మారారు అంటే ఇక మారేది సీఎంయే : మహేశ్వర్ రెడ్డి

-

కాంగ్రెస్ ఇన్చార్జి మారారు అంటే ఇక మారేది సీఎంయే. మిషన్ సీఎం చేంజ్ ను మీనాక్షి నటరాజన్ కి అప్పగించారు అని బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో వ్యవహారాలు కథలు కథలుగా నడుస్తున్నాయి, యు tax, B టాక్స్ ఇతర ట్యాక్స్ ల పై ఆ పార్టీ లో చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం ఉంటే సీఎంగా కొనసాగుతావు. డిసెంబర్ లోపు సీఎం మారుతారు.. మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి నాలుకకి నరం లేదు… మోడీని తిట్టాడు ఇప్పుడు మంచోడు అంటున్నారు. రేవంత్, ఆయన మంత్రి వర్గం గాడి తప్పింది. ముఖ్యమంత్రి నీ మంత్రులు లెక్క చేయడం లేదట. ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేశారు అని రేవంత్ రెడ్డి చెప్పారు అంటే రాహుల్ గాంధీ హింట్ ఇచ్చాడనేది స్పష్టం అవుతుంది. రేవంత్ రెడ్డి నీ పని చేయనియనిది, ఆయన కుర్చీ మీద కన్నేసింది భట్టి, ఉత్తం, పొంగులేటి. సీఎం కి ఎక్కడికక్కడ చెక్ పెడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఢిల్లీకి చేరవేస్తుంది ఉత్తం కుమార్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి రావడానికి ప్రధాన కారణం ఆయనే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురుంచి నాకు బాగా తెలుసు… ఆయన మాస్టర్ ప్లాన్ లు నాకు తెలుసు అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news