సీఎం రేవంత్ రెడ్డి తాను చదువుకున్న వనపర్తి కి వస్తే ఏదో ప్రకటిస్తారని ఆశించారు. రోజూ కేసీఆర్ ను తిట్టినట్టే వనపర్తి లో కూడా తిట్టారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చిన్న వయసులో సీఎంగా అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. తప్పు చేసేది వాళ్ళు ,నిందలు మా మీద వేస్తారు. హరీష్ రావు పై లేని పోని ఆంక్షలు పెట్టిన వాళ్ళు బీజేపీ వాళ్లకు ఘన స్వాగతం పలికారు.
SLBC ఘటన జరగకముందే హరీష్ రావు దుబాయ్ వెళ్లారు. హరీష్ రావు లేరనే SLBC ప్రమాదం పై ప్రభుత్వం చర్యలు చేపట్టలేదా.. ప్రభుత్వం లో ఉన్న వాళ్ళు పని చేస్తారా ?ప్రతిపక్షం లో ఉన్నవాళ్లు చేస్తారా. మంత్రులు కూడా దుబాయ్ వెడ్డింగ్ లకు హాజరయ్యారు. భాద్యత ఉన్న మంత్రులు ప్రమాదం జరిగితే దుబాయ్ లో జల్సాలు చేస్తారా. పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తాకి కూలిందట.. రేవంత్ రెడ్డి ఏదీ చేసినా అది వినాశనమే అన్నట్టు ఉంది అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.