బైకర్‌ను వేగంగా ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిన యువకులు

-

ద్విచక్ర వాహనాన్ని వేగంగా కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైకు నడిపిన వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మరో వ్యక్తి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడిపోయారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. తృటిలో ప్రాణాపాయం నుంచి ఆ ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారు.

ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. అతివేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న యూనికాన్ బైకు ఢీకొట్టగా యువకులు ఎగిరి వెనుక వస్తున్న ఆటోకు గుద్దుకున్నారు.ఈ ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news