కూటమి ప్రభుత్వం 9 నెలలులోనే చేతులెత్తేసారు. హామీలు నేరవేర్చకుండా కక్ష్య సాదింపు చర్యలు చేపడుతున్నారు అని కురసాల కన్న బాబు అన్నారు. చంద్రబాబును నమ్మి ఓటేస్తే చెప్పింది చేయకుండా కక్ష్య సాదింపు లకే దిగుతున్నారు. కానీ మీ కేసులకే బయపడేది లేదు. ఎంత దిగజారారో ఉత్తరాంధ్ర ఉపాద్యాయ mlc ఎన్నికల్లోనే లోనే అర్దమౌతుంది. ఇంత క్యారెక్టర్ లేస్ రాజకీయాలు ఏంటి.
9 నెలలో ఓక్క పథకం చెప్పింది చెప్పినట్లు అమలు చేయలేదు. వైసిపి కార్యకర్తలుకు ఏ పని చేయవద్దని చంద్రబాబు చెప్పడం తో మీ సీనియారిటీ పాతాలంలోకి వెలి పోయింది. అందరికి సమానంగా పనిచేస్తామని ప్రమాణస్వీకారం చేసి ఇంత దిగజారుతారా.. దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉంది. కులం, మతం, పార్టీ చూడం అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్. మీరు రాష్ట్రం కోసం అప్పులు చేస్తున్నారు కదా.. అప్పులు తెలుగు దేశం కేడర్ తీరుస్తాదా.. 2024 ఎన్నికలు నిజానికి – అబద్దానికి మద్య జరిగిన ఎన్నికలు. మీరు ఏం చేసినా మేం ప్రజల పక్షాన పోరాడుతాం. విలువలు లేని రాజకీయం చేస్తున్నారు.. అయినా మేం కలబడతాం అని కన్న బాబు పేర్కొన్నారు.