బకాయిలను విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరిన ఉత్తమ్..!

-

కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో మరోసారి భేటీ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ. 1,468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు ఉత్తమ్. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసారు.

అయితే గత 10 ఏళ్ళుగా తెలంగాణకు కేంద్ర ఆహరం, ప్రజాపంపిణీ శాఖ నుంచి సుమారు 2 వేలు కోట్ల రూపాయలు బకాయులు కేంద్రం నుంచి రావాలి. గతంలో కేంద్రానికి సంబంధిత పత్రాలను సమర్పించలేదు. ఇప్పుడు మేము ఇచ్చాం. వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరాం అని ఉత్తమ్ తెలిపారు. అలాగే సౌర విద్యుత్ పై సబ్సిడీ అడిగాం. “ప్రధాని కుసుమ్” పధకం కింద మహిళ సంఘాలకు 4 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సబ్సిడీ ఇవ్వాలని కోరాం. గిరిజన ప్రాంతాల్లో సబ్సిడీతో సహా, సోలార్ పంపులను ఇవ్వాలని కోరాం. వీటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు అని ఉత్తమ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news