కొత్త రేషన్ కార్డులపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ నాదెండ్ల మనోహర్. క్యూఆర్ కోడ్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈకేవైసీ అమలులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

ఏఐ కెమెరాల ద్వారా రేషన్ గోదాముల్లో స్టాక్ పై పర్యవేక్షణ ఉంటుందని కూడా తెలిపారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ . సివిల్ సప్లయ్స్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు పై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలోనే.. మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డుల ప్రకటన చేశారు.