విజయవాడ ధర్నా చౌక్ వద్దకు భారీగా చేరుకున్నారు ఆశా వర్కర్లు. ఈ సందర్భంగా అక్కడే కూర్చోని ధర్నా చేస్తున్నారు. రోడ్డు మీద సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు కూర్చుని.. నిరసన తెలుపుతున్నారు ఆశావర్కర్లు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్ల ఆందోళనకు దిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ ధర్నా చౌక్ కు చేరుకుంటున్నారు ఆశావర్కర్లు. 42,518 మంది ఆశావర్కర్లు, 2300 మంది కమ్యూనిటీ హెల్త్ వర్లర్లు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు.

ధర్నాచౌక్ కు ఇప్పటి వరకూ 1600 మంది ఆశా వర్కర్లు చేరుకున్నారు. అటు ఆశావర్కర్ల కదలికలను డ్రోన్లు, ఇంటిలిజెన్స్ టీం ల ద్వారా కనుగొంటున్నారు పోలీసులు. ధర్నాచౌక్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు కూడా ఉంది. ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, ర్యాపిడ్ యాక్షన్ టీం లను సిద్ధం చేశారు పోలీసులు. ఏడీసీపీ, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర సిబ్బంది మొత్తం 100 మందితో భద్రత ఏర్పాటు చేశారు.