తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై తాజాగా అరెస్టు అయ్యారు. తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసాయి బిజెపి సంతకాలు సేకరణ. దీని కారణంగా మాజీ గవర్నర్ ను అరెస్ట్ చేసారు. ముఖ్యంగా త్రిభాష సిద్ధాంతాల అమలు కోసం కోటి సంతకాల సేకరణ ప్రారంభించింది బీజేపీ. కోటి మంది సంతకాలు సేకరించి రాష్ట్రపతికి నివేదిస్తామన్నారు నేతలు.
ప్రధానంగా త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు చెన్నై ఎంజీ ఆర్ నగర్ లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ బీజేపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసైతో సహా ఇతర నేతలను అరెస్ట్ చేశారు పోలిసులు.