తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తరచూ బీజేపీ పార్టీ, ఎన్నికల సంఘాన్ని విమర్శించే నాయకులకు
తెలంగాణ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే గుణపాఠం అని విమర్శించారు. ఈవీఎంలను విమర్శించే వారు ఇప్పుడే ఏం చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు ఇంకా దొరల అహంకారం తగ్గలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. వరుస విజయాలతో తెలంగాణ బీజేపీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.
మొన్న టీచర్స్, నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో అటు రాష్ట్ర నేతలు, ఇటు క్షేత్రస్థాయి కేడర్ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపొందాలని లక్ష్యంగా పెటుకున్నారు. అందులో సక్సెస్ సాధిస్తే.. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీజేపీనే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.