తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది : కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దీ నెలల్లోనే కాంగ్రెస్ తో సమానంగా బీజేపీకి ఎంపీ సీట్లు కట్టబెట్టింది తెలంగాణ సమాజం అని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూడు స్థానాల్లో రెండు కీలకమైనవి. కాంగ్రెస్ సిట్టింగ్ స్ధానంలో బీజేపీని గెలిపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని గ్రహించే రాష్ట్ర ప్రజలు బీజేపీని గెలిపించారు. రెండు ఎమ్మెల్సీల విజయంతో బీజేపీ బాధ్యత మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి బీజేపీపైన ఆనేక తప్పుడు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో బిజేపిని గెలిపించారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు. శాసన మండలి, సభలో ప్రజల సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. శాసన మండలి, సభలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపిస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్టే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరండమని తాము అనడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇప్పటివరకైనా నెరవేర్చాలి. కాంగ్రెస్ గిఫ్ట్ మాకు అవసరం మాకు లేదు.. రాహుల్ గాంధీకి ఇచ్చుకోండి. తెలంగాణ ప్రజలు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు.. ఇస్తారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news