దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం…!

-

పారాలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. పారాలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. సీఎం రేవంత్ అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు సమావేశాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నారట.

Deepthi Jeevanji get a government job revanth

ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 10,950 విలేజ్‌ లెవల్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది సర్కార్‌. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news