యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు !

-

పాలకుర్తిలో అత్త, కోడళ్ళకు షాక్ తగిలింది. పాలకుర్తిలో అత్త, కోడళ్ళ ఆగడాలు భరించలేక కాంగ్రెస్ ఇన్చార్జి కి లేఖ రాశాడు ఓ కాంగ్రెస్ కార్యకర్త. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సి రెడ్డి పార్టీకి తీరని నష్టం చేస్తున్నారంటూ ఏఐసీసీ కొత్త ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కు పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ఓ వ్యక్తి లేఖ రాయడం జరిగింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త నియోజకవర్గం ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడంలో లేదని ఇందులో పేర్కొన్నారు.


పాలకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పక్కనపెట్టి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తో పాటు ఆమె అత్త నియోజకవర్గం ఇంచార్జి ఝాన్సీ రెడ్డి ఒంటెద్దు పకోడా గా వ్యవహరిస్తున్నారని లేఖల పేర్కొన్నారు ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఆదుకొని తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news